>తెలంగాణ లో ఎక్కువమంది ఆదివాసీలు , గిరిజనులు, బంజారాలు ఉంటారు . వాళ్ళ వాళ్ళ జీవిత విధానాల మూలంగా రిమోట్ ఏరియాస్ లో ఎక్కువమంది ఉండటం మూలంగా వాళ్ళకి చదువు ప్రయారిటీ అవ్వలేదు. వీళ్ళ జనాభా ఎంత? >వాళ్ళకి చదువు ప్రయారిటీ అవ్వలేదు. దాన్ని(చదువుని) ప్రోత్సహించకుండా , వాళ్లలో ఆంధ్రావాళ్లకన్నా వెనక ఉన్నాం ఉన్న అసంతృప్తిని, ఆకలితో కోపంగా ఉన్నవాళ్ళని ఎగదోసి దాన్ని ఆంధ్రా వాళ్ళ మీద కోపంగా మలిచింది నాయకులు అన్నాను మీరు ఒక్క సగటు ఆంధ్ర వ్యక్తి అని మళ్ళీ నిరూపించుకున్నారు. ఎంతసేపు రాజకీయ నాయకుకు ఎగదోస్తున్నారు అంటున్నారు తప్ప, ఎప్పుడైనా నిజంగా తెలంగాణ వాళ్లకి ఏం కావాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? 1969లో ౩౦౦లకుపైగా విద్యార్థులను చంపాడు అప్పటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి. అప్పుడు కూడా రాజకీయ నాయకులు ప్రేరేపించడం వల్లనే ఉద్యమం మొదలైందంటారా? ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు నకిలీ దస్తావేజులతో  ప్రభుత్వోద్యోగాలు సాధించింది నిజం కాదా? గిర్గ్లానీ రిపోర్ట్ తప్పు చెప్తుంది అంటున్నారా? తెలంగాణలోని వ్యవసాయానికి అప్పటి ప్రభుత్వాలు మొండిచెయ్యి చూపించడం అబద్ధం అంటున్నారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయంలో దేశంలోనే ముందున్న విషయం కూడా అబద్ధమా? నల్గొండలో ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగి జబ్బుపడటం నిజం కాదంటారా? అప్పటి ప్రభుత్వాల అలసత్వం కారణంగా మహబూబ్నగర్ ప్రజల వలసలు అన్ని అబద్ధం అంటున్నారా? >వాళ్లని చూసి ఇక్కడి వాళ్ళు మా జాబులు , మా ఆస్తులు , అంటూ గగ్గోలు పెట్టాలా ఇప్పుడు ? అప్పుడు తెలంగాణలో ప్రభుత్వోదోగాలు తెలంగాణవారికి రిజర్వు చేయబడటం అబద్ధమా? మీకు కూడా ఇప్పుడు రిజర్వేషన్ ఏమైనా ఉంటె మా డాక్టర్లు ఆంధ్రకి వచ్చి పనిచేయడం తప్పు. ఇక ఈ ఉద్యోగాల విషయం మీ విజ్ఞతకే వదిలేస్తున్న. అప్పుడు ఉన్న ముల్కి విధానాన్ని, ఇప్పుడు ఆంధ్ర AIIMSలో పని చేస్తున్న తెలంగాణ డాక్టర్ని ఎట్లా పోలుస్తున్నారో నాకు అర్థం అయితలేదు. >ఎందుకు రాజకీయనాయకుల ఆటలో పావులు అవుతారు ? ఇప్పటివరకు నేను చెప్పింది అంత అబద్ధం, మీరు చెప్పిందే నిజం, తెలంగాణవాదం ఒక్క రాజకీయ నాయకుని కుట్ర అనుకుంటే ఇక మిమ్మల్ని ఎవ్వరు బాగుచేయలేరు.